నేను ఎలాంటి డ్రగ్స్​ తీసుకోలే:విజయ్ మద్దూరి

నేను ఎలాంటి డ్రగ్స్​ తీసుకోలే:విజయ్ మద్దూరి

‘‘నా పేరుతో సోషల్  మీడియాలో అనేక రకాల రూమర్లు వస్తున్నాయి. ఎఫ్ఐఆర్ లో రాసిన  ప్రతి వాక్యం తప్పే. నా వాదన చాలా స్పష్టంగా చెప్పాను. నేను చెప్పని మాటలు కూడా చెప్పినట్టు ఎఫ్ఐఆర్ లో రాశారు.  నేను ఈ మధ్యనే విదేశాలు వెళ్లి వచ్చా. దానికి సంబంధించిన రుజువులను కూడా చూపించా. ఇండియా లో నేను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదు” అని విజయ్​ మద్దూరి ఆదివారం రాత్రి ఓ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. 

తన మిత్రుడు రాజ్ పాకాల ఆహ్వానం మేరకు కుటుంబంతో  ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరయ్యానని చెప్పారు. ‘‘ఆ ఫంక్షన్​లో చిన్న పిల్లలతో సహా మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదు. పోలీసులు చేస్తున్న ఆరోపణలతో తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నాం. ఇది చాలా తప్పు. ఇది నా కుటుంబంతోపాటు నా స్నేహితులకు ఫ్యామిలీస్​కు, రిలేటివ్స్​కు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నది” అని ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు.