రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఇప్పటివరకు 16 సీజన్ లు ఆడినా మెన్స్ సాధించలేని ఘనతను రెండో సీజన్ లోనే మహిళలు గెలిచి ఫ్యాన్స్ కరువు తీర్చారు. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సరి కొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారి ఆర్సీబీ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మాజీ క్రికెటర్లు మహిళల జట్టును ప్రశంసిస్తూ తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతవరకు భాగమే ఒక ఊహించని వ్యక్తి ఆర్సీబీను ప్రశంసించడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
విజయ మాల్యా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఫ్రాంచైజీగా క్రికెట్ అభిమానులను పలకరించాడు. తాజగా చాలా కాలం తర్వాత ఆర్సీబీ మహిళలు టైటిల్ గెలవడంతో వారిని అభినందిస్తూ ట్వీక్ట్ చేశాడు." ఆర్సీబీ మహిళల జట్టుకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ సీజన్ లో ఆర్సీబీ మెన్స్ జట్టు టైటిల్ గెలిస్తే అది డబుల్ కిక్ అవుతుంది. గుడ్ లక్" అని తన ఎక్స్ ద్వారా తెలిపారు.
వ్యాపార భారత బ్యాంకుల నుంచి రూ. వేళా కోట్లు అప్పు తీసుకొని విదేశాలకు పరారైన ఈ బడా పారిశ్రామిక వేత్త.. ఉద్ద్యేశ్య పూర్వకంగానే ఎగవేతకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. 2015-16 మధ్య కాలంలో లో మాల్యా రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. దీంతో ఇప్పుడు ఇతని మీద సోషల్ మీడియా ట్రోల్స్ వర్షం కురిపిస్తుంది. "క్యా పతా విజయ్ మాల్యా ఇస్సీ ఖుషీ మై ఇండియా వాపిస్ ఆ జాయే" అని 'X'లో ఒక నెటిజన్ కామెంట్ చేస్తుంటే.."విజయ్ మాల్యా చాలా కాలం గడిచిన దాని గురించి మాట్లాడటం SBI ఉద్యోగులు చూస్తున్నారు" అని మరొక నెటిజన్ చమత్కరించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 రన్స్‌కే ఆలౌటైంది. షెఫాలీ వర్మ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), మెగ్ లానింగ్ (23 బాల్స్‌లో 3 ఫోర్లతో 23) రాణించగా, ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115/2 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్ (17 నాటౌట్) విన్నింగ్ ఫోర్‌తో ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మొనులిక్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శ్రేయాంక పాటిల్ (4/12), సోఫీ మొనులిక్స్ (3/20) సూపర్ బౌలింగ్‌కు తోడు ఛేజింగ్‌లో ఎలైస్ పెర్రీ (37 బాల్స్‌లో 4 ఫోర్లతో 35 నాటౌట్), సోఫీ డివైన్ (32), కెప్టెన్ స్మృతి మంధాన (31) మెరుగ్గా ఆడటంతో.. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
Vijay Mallya talking about something long overdue#RCBvDC #RCBWvsDCW #WPLFinal #Cricket https://t.co/yOqr25vNlG pic.twitter.com/SphJy5QeyO
— Bishnoi R (@bishnoi93R) March 17, 2024
Kya pata Vijay Mallya issi khushi mai India wapis aa jaye.
— Silly Point (@FarziCricketer) March 17, 2024