గణేష్ చతుర్థి విషెస్ చెప్పిన విజయ్ మాల్యా : ఎక్స్(X)లో కామెడీ పంచ్ లు

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో ఓ ఇంట్రస్టింగ్ పోస్టుతో ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన తన X ఫాలోవర్లకు గణేష్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాల్యా చేసిన ఈ పోస్ట్ అపహాస్యాన్ని ప్రేరేపించింది. ప్రధానంగా భారతీయ పండుగపై చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు పలురకాలుగా స్పందించారు. భారతీయ బ్యాంకులు మూసివేసే రోజులలో వీరు సోషల్ మీడియాను ప్రత్యేకంగా ఉపయోగించుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు.

“మీకు కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు! మీరు బ్యాంక్ హాలిడేస్‌లో కనిపించే మీ సంప్రదాయాన్ని కొనసాగించండి" అంటూ ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read :- మణిపురి నటిపై మూడేళ్ల నిషేధం

“అతను బ్యాంకులకు తిరిగి చెల్లించడం మర్చిపోయాడు, కానీ అతను ఎప్పుడూ భారతీయుడిని మర్చిపోడు. అతను నిజమైన దేశభక్తుడు" అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. కాగా మాల్యా చేసిన ఈ పోస్టుకు ఇప్పటివరకు 19వేల లైక్స్, 1.1మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.