యాక్టర్ విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహం : 2026 ఎన్నికల యుద్ధానికి వ్యూహాలు

యాక్టర్ విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహం : 2026 ఎన్నికల యుద్ధానికి వ్యూహాలు

నటుడు, రాజకీయ నేత, తమిళ వెట్రి కజం(టీవీకే) చీఫ్ విజయ్ తన పార్టీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహాబలిపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2026 ఎన్నికలకు ముందు విజయ్ నిర్వహించిన బహిరంగసభ తమిళరాజకీయాలను వేడెక్కించాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరు కావడం చర్చనీ యాంశమైంది.

టీవీకే సభకు ప్రశాంత్ కిషోర్ హాజరకావడం తమిళనాడు రాజకీయాల్లో కలవరం మొదలైంది. ఎన్నికల వ్యూహంలో భాగమని దేశమంతటా గెలుపు ప్రచారాలను రూపొందించడంలో సిద్దహస్తుడైన కిషోర్..వచ్చే ఎన్నికల్లో టీవీకేకు రోడ్ మ్యాప్ మార్గనిర్దేశం చేస్తున్నారని, పార్టీ బలోపేతం, గెలుపుకు సలహాలు సూచనలు ఇస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 

మరోవైపు విజయ్ #GetOut  అనే సైన్ బోర్డుపై సంతకం చేయడం కూడా ఆసక్తి రేపుతోంది. ఇటీవల డీఎంకే, బీజేపీ పార్టీలు తీసుకొచ్చిన #గెట్ అవుట్ మోదీ, #గెట్ అవుట్ స్టాలిన్  ట్రెండ్ కు భిన్నంగా విజయ్ #GetOut తో ముందుకెళ్తున్నారు. ఈ రెండు పార్టీ మధ్య రహస్య కూటమి ఉందని,ఇది రాష్ట్ర ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడమేనని బీజేపీ, డీఎంకే లపై విజయ్ తన స్పష్టమైన వైఖరిని చెప్పాడు. 

విజయ్ రాజకీయ ప్రస్థానం ఎంజీఆర్, జయలలిత లాంటి తమిళ సినిమా లెజెండ్స్‌తో కాస్త దగ్గరగా ఉంది. తమిళ సినిమా పరిశ్రమనుంచి సీఎం స్థాయికి ఎదిగిన ఎంజీఆర్, జయలలిత లాంటి తమిళ సినిమా లెజెండ్స్‌ ఉన్నారు. అయితే శివాజీ గణేషన్, విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ తమ స్టార్ పవర్ ను రాజకీయ సక్సెస్ గా మార్చుకోలేకపోయారు.

విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత అటు బీజేపీ, ఇటు డీఎంకే పార్టీలకు మింగుడు పడటం లేదు. ఒక దేశం ఒకే పోల్ నినాదంపై బీజేపీపై దాడి చేస్తూనే.. తమిళనాడులో శాంతిభద్రతలు, రాజవంశ రాజకీయాలపై డీఎంకేను తీవ్రంగా విమర్శిస్తున్నారు విజయ్. అయితే ఏఐఏడీఎంకేపై ఆయన మౌనం వహించడం వల్ల పొత్తు పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

TVK ఇంకా ఏ ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ, విజయ్-AIADMK పొత్తు డీఎంకేకు తీవ్రమైన సవాలుగా మారింది. జయలలిత మరణానంతరం అంతర్గత పోరు, నాయకత్వ వివాదాలతో బలహీనపడిన ఏఐఏడీఎంకే.. ఎన్నికలకు ముందే పటిష్టం కావాలని చూస్తున్న క్రమంలో ఆ రెండు పార్టీల కూటమిలో విజయ్ జూనియర్ పాత్రను పోషించడానికి ఇష్టపడుతున్నాడా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది.