Vijay Sethupathi: స్క్రిప్ట్ న‌చ్చితేనే సినిమా చేస్తా.. పూరి ప్రాజెక్ట్‌పై స్పందించిన విజ‌య్ సేతుప‌తి

Vijay Sethupathi: స్క్రిప్ట్ న‌చ్చితేనే సినిమా చేస్తా.. పూరి ప్రాజెక్ట్‌పై స్పందించిన విజ‌య్ సేతుప‌తి

దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ మూవీ వస్తోన్న విషయం తెలిసిందే. పూరి చెప్పిన స్టోరీ లైన్, హీరో క్యారెక్టరైజేషన్ విజయ్కు తెగ నచ్చేయడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఒకే అయిపోయిందని సమాచారం.

అయితే, ఫామ్లో లేని డైరెక్టర్ పూరితో విజయ్ సినిమా చేస్తుండటం పట్ల సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తమ కాంబోపై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్పై  విజయ్ సేతుపతి రియాక్ట్ అయ్యాడు. 

ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌వుతున్న పూరితో సినిమా ఎలా ఓకే చేశారనే ప్ర‌శ్న‌కు విజయ్ స్పందిస్తూ.. " పూరి జగన్నాథ్‌తో నేను చేయబోతున్న సినిమా షూటింగ్‌ జూన్‌లో స్టార్ట్ అవుతుంది. దర్శకులను వారి గత సినిమాల రిజల్ట్స్ను బట్టి జడ్జ్‌ చేయను. నాకు స్క్రిప్ట్‌ నచ్చితేనే సినిమా చేస్తాను. పూరి చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఆయనతో సినిమా చేయడం ఒప్పుకున్నాను.

ఇలాంటి కథను ఇప్పటివరకూ చేయలేదు, వినలేదు కూడా. నేను మొదటి నుంచి చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఉండేలా చెక్ చేసుకుంటాను. గతంలో చేసిన స్టోరీస్ రిపీట్ కాకుండా కొత్త కథలకే ప్రాధాన్యం ఇస్తాను. ఒక స్ట్రాంగ్ బేస్ కంటెంట్ తో సినిమా ఉండనుందని" విజయ్ క్లారిటీ ఇచ్చాడు.

అలాగే ఈ మూవీలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. 'టబు గొప్ప నటి. టాలెంటెడ్ కోస్టార్. గతంలో ఎప్పుడూ ఆమెతో కలిసి స్క్రీన్ పంచుకోలేదు. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉందని విజయ్ అన్నారు.

ఇకపోతే, విజయ్ సేతుపతికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని పూరి జగన్నాథ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఇందులో విజయ్‌‌‌‌‌‌‌‌ని  సరికొత్తగా చూపించబోతున్నట్టు, ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని సమాచారం.

రెగ్యూలర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా క్రైమ్‌‍తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్‌ని పూరి రూపొందిస్తున్నట్లు మరో టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘బెగ్గర్’అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రోజునే అంచనాలు పెరిగాయి.