
సినీ సెలెబ్రెటీలు విపత్కర సమయంలో, లేదా తమ ఫ్యాన్స్ ఏదైనా అవసరమని ఇంటి గడప తొక్కితే కొంతమంది తోచినంత సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటారు. మరికొందరు అవకాశాల విషయంలో మాట సాయం చెయ్యడం, రికమెండ్ చెయ్యడం వంటివి చేస్తుంటారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినీ పరిశ్రమలోని కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు రూ.కోటి పైగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు
ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని పయ్యనూర్‌లో చిత్ర పరిశ్రమ కార్మికులకు నివాస స్థలాలను కేటాయించే కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న 250 మంది ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఈ ఇళ్ల నిర్మాణాలకు తన వంతు సాయంగా విజయ్ సేతుపతి రూ.1.30 కోట్లు విరాళం ఇచ్చాడు. దీంతో సినీ కార్మికుల కాలనీలోని మొదటి టవర్ కి హీరో విజయ్ సేతుపతి పేరు పెట్టారు.
Also Read :- కట్నం క్యాష్ రూపంలో కావాలంటున్న సప్తగిరి
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్ ని అభినందిస్తున్నారు. ఇందులోభాగంగా సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న ఉద్యోగులకి సరైన వేతనాలు లేక ఇబ్బంది పడుతుంటారని దీనికితోడు జీతంలో సగానికిపైగా ఇంటి అద్దె చెల్లించాడనికి సరిపోతుందని అలాంటివారికి ఆర్ధిక సహాయం చేసి పని చేశాడంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.
అయితే నటుడు విజయ్ సేతుపతి ఈ మధ్య హీరోగా మాత్రమేకాదు విలన్ గ కూడా చేస్తూ వెర్సటైల్ నటనతో ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది విజయ్ మహారాజా, విడుదల పార్ట్ 2 తదితర సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఏస్, ట్రైన్ సినిమాలతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.