
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపును అందుకున్నాడు రామ్ చరణ్(Ram Charan). ప్రస్తుతం శంకర్( S Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’(Game Changer) మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న చరణ్..
రీసెంట్‌గా తిరిగి సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ కియారా అద్వానీతో పాటు మిగిలిన నటీనటులంతా పాల్గొనబోతున్నారని తెలిసింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు శంకర్. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండటంతో చరణ్ షూటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నాడట. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)ని సంప్రదించారట.
బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ నటించడంతో ఈ సినిమాకు ఒప్పుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చరణ్ సరికొత్త మేకవర్‌లో కనిపించనున్నాడట. అలాగే ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నట్టు, ఇప్పటికే వర్క్ కూడా మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.