![షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో విలన్‌గా విజయ్ సేతుపతి](https://static.v6velugu.com/uploads/2022/12/Vijay-Sethupathi-is-playing-the-villain-in-Shah-Rukh-Khan's-movie-Jawaan_P2J3gvuGQa.jpg)
కథతో పాటు పాత్ర నచ్చితే.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటివేమీ చూడకుండా నటిస్తాడు విజయ్ సేతుపతి. తన యాక్టింగ్ టాలెంట్‌కు సౌత్‌తో పాటు బాలీవుడ్ మేకర్స్ కూడా ఫిదా అవుతుంటారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న సేతుపతి.. క్యారెక్టర్స్ కోసం బరువు పెరిగాడో లేక షూటింగ్స్ బిజీ వల్ల ఫిజిక్‌పై దృష్టి పెట్టలేదో కానీ గత కొంతకాలంగా బొద్దుగా కనిపిస్తున్నాడు. ఇటీవల తను నటించిన సినిమాల్లో ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ ఒక్క విషయంలోనే ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సేతుపతి.. మేకోవర్‌పై ఫోకస్ పెట్టాడు. సెల్ఫీ తీసుకున్న తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఈ ఫొటోలో మునుపటిలా స్లిమ్‌గా కనిపిస్తున్నాడు సేతుపతి. ఇక ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’లో విలన్‌గా నటిస్తున్నాడు.