శ్రీలంక స్పిన్నర్ బయోపిక్‌‌ లో విజయ్ సేతుపతి

శ్రీలంక స్పిన్నర్  బయోపిక్‌‌ లో విజయ్ సేతుపతి

శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌‌ను ‘800’ టైటిల్‌‌తో రెండేళ్ల క్రితమే విజయ్ సేతుపతి హీరోగా ప్రకటించారు. కానీ తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అయితే మేకర్స్ మాత్రం వదల్లేదు. ‘స్లమ్‌‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్‌‌.. ముత్తయ్యగా నటించబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. కెరీర్‌‌లో 800 టెస్ట్‌‌ వికెట్స్‌‌ తీసిన ఏకైక ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ బౌలర్‌‌గా అరుదైన రికార్డు మురళీధరన్‌‌ ఖాతాలో ఉంది.

అందుకే ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌‌ను పెట్టారు. మురళీ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు మధుర్. అతని ముఖంపై బెయిల్స్‌‌తో వికెట్ల షాడోతో పోస్టర్‌‌‌‌ను డిజైన్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఎం.ఎస్.శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.