బోల్డ్‌‌‌‌‌‌‌‌ కన్నన్‌‌‌‌‌‌‌‌గా.. విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి లీడ్ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘ఏస్‌‌‌‌‌‌‌‌’.  రుక్మిణి వసంత్ హీరోయిన్.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ లభించింది. గురువారం విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ‘బోల్డ్‌‌‌‌‌‌‌‌ కన్నన్‌‌‌‌‌‌‌‌’ అనే పాత్రలో నటిస్తున్న సేతుపతి.. సంప్రదాయ తమిళ దుస్తులు ధరించి మలేషియాలోని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో డైనమిక్ గా నడుస్తూ కనిపించాడు.

అలాగే హై- ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌లో ఫైట్స్ చేస్తూ,  ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో డ్యాన్స్ చేస్తూ యాక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ ఇందులో ఉందని చూపించాడు.  అరుముగకుమార్ ఈ చిత్రానికి దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు