Bigg Boss Tamil 8: బిగ్‏బాస్ హోస్ట్‏గా తప్పుకున్న కమల్‌ హాసన్‌..మరో స్టార్ హీరో ఎంట్రీ

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) టాలీవుడ్, కోలీవుడ్ లో తన సహజ నటనతో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. హీరోగా, విలన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లేటెస్ట్ గా ఈ స్టార్ హీరో తమిళ బిగ్ బాస్ 8(Bigg Boss Tamil 8)కి కొత్త హోస్ట్గా వ్యవహరిస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేస్తూ..విజయ్ సేతుపతికి వెల్ కం చెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ తాజా అప్డేట్ తో  విజయ్‌ సేతుపతి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో విజయ్ సేతుపతి మరింత స్టైలీష్ గా కనిపించారు.అతి త్వరలో తమిళ బిగ్‏బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. 

Also Read :- నాని క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 గ్లింప్స్ రిలీజ్

అయితే మొదటి నుంచి అంటే 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నారు కమల్.ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండడంతోనే కమల్ ఈ షో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.