Jana Nayagan OTT: కళ్లు చెదిరే మొత్తానికి జన నాయగన్ ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Jana Nayagan OTT: కళ్లు చెదిరే మొత్తానికి జన నాయగన్ ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్  ప్లాట్‌ఫామ్ ఇదే!

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి మూవీ జన నాయగాన్ (Jana Nayagan).ఈ మూవీపై సినీ అభిమానుల్లో మాత్రమే కాకుండా దేశ రాష్ట్ర రాజకీయాల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 జనవరి 9న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో జన నాయగాన్ ఓటీటీ వివరాలు బయటకి వచ్చాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. జన నాయగాన్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.121 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

ALSO READ | Keerthy Suresh: రణబీర్ కపూర్తో కీర్తి సురేష్.. యానిమల్ రేంజ్లో రొమాంటిక్ డ్రామా స్టోరీ!

2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం.. అందుకు కొన్ని నెలల ముందు సినిమా విడుదల అవుతుండటంతో ఈ ధర పలికినట్లు టాక్. దానికి తోడు విజయ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కూడా విడుదలకు ముందే, ఇలాంటి ధర పలకడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అందుకు కారణం లేకపోలేదు.. 'జన నాయగన్' సినిమాతో విజయ్ బలమైన సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో.. సామజిక కథ, కథనాలతో రూపొందుతుంది. అలాగే, ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిస్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. అసెంబ్లీ బరిలో తన గళం చాటబోతున్నాడు. ఇప్పటికే, విజయ్ దేశ రాజకీయ నాయకుల మదిలో అనుక్షణం నిద్రిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జన నయగాన్ సినిమా ద్వారా ఎలాంటి అంశాలు లేవనెత్తనున్నాడో ఆసక్తిగా మారింది.

ఈ సినిమాలో విజయ్కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్దే నటిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమిత బైజు, మోనిషా బ్లెస్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.