
తమన్నా (Tamannaah Bhatia), నటుడు విజయ్ వర్మ (Vijay Varma) కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి ప్రేమ గురుంచి మీడియాతో పాటు అభిమానులు కూడా నమ్ముతున్నారు. రీసెంట్ గా విజయ్, తమన్నా వారి మనసులో మాటను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే వీరిద్దరూ నిజంగా రిలేషన్‌లో లేరని, ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories 2) ప్రచారం కోసం అలా చెప్పారని ఇటీవల వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రచారానికి చెక్ పెడుతూ తాజాగా విజయ్ వర్మ.. తమన్నాతో తన రిలేషన్ గురించి స్పందించారు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చెప్పారు. ‘‘మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె రాకతో నా జీవితంలో విలన్ దశ ముగిసిపోయి.. రొమాంటిక్ దశ మొదలైంది’’ అని చెప్పారు. దీంతో తమన్నాతో ఎంతలా ప్రేమలో ఉన్నాడో అందరికీ అర్ధమయింది.
ALSO READ :షారుఖ్ తో మరో రొమాంటిక్ సాంగ్ చేయాలనుంది..కాజోల్
లస్ట్ స్టోరీ 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్‌తో తన రిలేషన్‌పై ఇటీవల తమన్నా స్పందిస్తూ.. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలానే ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే నాకు విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకు కష్టం వస్తే నాతోనే ఉంటాడనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.. దీంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.