మట్కా కింగ్‌‌‌‌ గా విజయ్ వర్మ వెబ్ సిరీస్

మట్కా కింగ్‌‌‌‌ గా విజయ్ వర్మ వెబ్ సిరీస్

ఓ వైపు సినిమాలు,  మరోవైపు వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లతో బిజీగా ఉన్నాడు విజయ్ వర్మ. ప్రస్తుతం తను హీరోగా ‘మట్కా కింగ్’ అనే వెబ్ సిరీస్‌‌‌‌ తెరకెక్కుతోంది. ‘సైరత్‌‌‌‌’ ఫేమ్‌‌‌‌ నాగరాజ్ మంజులే  దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌కు సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్నాడు. 1960 నాటి ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌‌‌‌ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఇక మట్కా కింగ్‌‌‌‌ అనగానే ముంబై కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్‌‌‌‌తో పెద్ద నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను సృష్టించిన రతన్‌‌‌‌ ఖత్రీ గుర్తొస్తాడు.  

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ఇంటర్నెట్ లేని రోజుల్లోనే దేశవ్యాప్తంగా బెట్టింగ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఖత్రి. అతని జీవితం ఆధారంగానే ఈ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక తెలుగులో ఇదే కాన్సెప్ట్‌‌‌‌తో వరుణ్ తేజ్ హీరోగా ‘మట్కా’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇక ‘మట్కా కింగ్‌‌‌‌’లో విజయ్ వర్మతో పాటు కృతికా కమ్రా, సాయి తమహంకర్, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.