
ఓవైపు హీరోగా నటిస్తూనే ‘విక్రమ్’ లాంటి చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెర్సటైల్ యాక్టర్‌గా మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. రాజ్ డీకే డైరెక్ట్ చేసిన ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చిన సేతుపతి.. ఇందులోని టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్ పాత్రతో హిందీ ప్రేక్షకులను కూడా ఇంప్రెస్ చేశాడు. తాజాగా మరో వెబ్ సిరీస్‌కు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తమిళంలో సేతుపతి నటించబోయే ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దీనికి దర్శకుడు. థ్రిల్లర్ కంటెంట్‌తో రూపొందే ఈ వెబ్ సిరీస్ ఓపెనింగ్ ఇటీవల చెన్నైలో జరిగింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. గతంలో మణికందన్ డైరెక్షన్‌లో ఆనందవాన్ కట్టాలై, కడాసి వ్యవసాయి చిత్రాల్లో నటించాడు విజయ్ సేతుపతి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు నెలకొన్నాయి.