పాడి రైతులకు రూ.90 కోట్లు బాకీ ఉన్నం : ఎండీ చంద్రశేఖర్ రెడ్డి

పాడి రైతులకు రూ.90 కోట్లు బాకీ ఉన్నం : ఎండీ చంద్రశేఖర్ రెడ్డి
  • విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి

ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులకు రూ.90 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని విజయ డెయిరీ ఎండీ కట్ట చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.  ఐఏఎస్ గా పదోన్నతి పొంది బుధవారం సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా.. ఆయనను గ్రామస్తులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులకు 42 రోజులకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం రూ. 50 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.

విజయ డెయిరీకి పాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. తాను ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 50 వేల లీటర్ల వ్యాపారం పెరిగిందన్నారు. త్వరలోనే రైతులకు బకాయిలు చెల్లించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పీఏసీఎస్​ మాజీ చైర్మన్  మడ్డు నరేందర్ రెడ్డి, పాల శీతలీకరణ కేంద్రం మాజీ చైర్మన్  కట్టా గోపాల్ రెడ్డి, కాంగ్రెస్  డల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, నాయకులు షణ్ముఖ రెడ్డి, చంద్రారెడ్డి, పర్వత్ రెడ్డి, బూసిరెడ్డి, ధర్మారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కట్ట సరిత పాల్గొన్నారు.