వంటి మామిడి మార్కెట్​ చైర్​పర్సన్​గా విజయ

వంటి మామిడి మార్కెట్​ చైర్​పర్సన్​గా విజయ

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్​కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. చైర్​పర్సన్​గా బాగనోళ్ల విజయ మోహన్,  వైస్ చైర్మన్ గా కొడిత్యాల ప్రభాకర్ గుప్తా, డైరెక్టర్లుగా కుతాడి శ్రీనివాస్, ఆదసు మహేందర్, ఏనుగు నరసింహారెడ్డి, సాలెంద్రి మల్లేశ్, కొమ్మిడి నర్సారెడ్డి, భూక్య శ్రీనివాస్, గుండా శంకర్ రావు, ర్యాకం యాదగిరి, పత్తి నర్సింలు, పుల్లబోయిన భిక్షపతి, సయ్యద్ వజిత్, కుంట శశికాంత్ రెడ్డి, మరో నలుగురు అఫీషియో డైరెక్టర్లుగా నియామకమయ్యారు. వీరందరూ మార్కెట్ కమిటీ సెక్రటరీ రేవంత్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు.సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి, పవన్ రెడ్డి, ఐలేశ్ యాదవ్, శేఖర్, కిరణ్, శివ, కుమార్, భార్గవ్, స్వామి పాల్గొన్నారు. 

కొండపాక మార్కెట్ కమిటీ నియామకం

కొండపాక: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుకునూరు పల్లి మండలం మేదిన్ పూర్ గ్రామానికి చెందిన వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గా బందారం గ్రామానికి చెందిన బట్ట పర్శ రాములు నియమితులయ్యారు  సోమవారం బాధ్యతలు స్వీకరించారు.