జాతీయ మహిళా కమిషన్ కు నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్‌ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 19న నియమించింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్స్ చట్టం 1990లోని సెక్షన్ 3 ప్రకారం ఈమె మూడేళ్లపాటు లేదా 65ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. జాతీయ మహిళా కమిషన్ 9వ ఛైర్‌పర్సన్‌గా విజయ రహత్కర్ బాధ్యతలు స్వీకరించారు. రహత్కర్ తో పాటు డాక్టర్ అర్చన మజుందార్‌ను మూడేళ్ల కాలానికి మహిళా కమిషన్ నూతన సభ్యురాలిగా కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. విజయా రహత్కర్ 2016 నుంచి-2021 వరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. రహత్కర్ స్త్రీల అభ్యుదయం, అభివృద్ధి కోసం అనే కార్యక్రమాలు చేపట్టారు. యాసిడ్ దాడి బాధితులకు మద్దతుగా సక్షమా, స్వయం సహాయక బృందాలను కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయడానికి ప్రజ్వల, మహిళల కోసం 24x7 హెల్ప్‌లైన్ సేవలు అందించడానికి సుహిత అనే కార్యక్రమాలు రహత్కర్ ప్రవేశపెట్టారు.
ALSO READ | శిక్షిస్తే ఆగవు..బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలి: సుప్రీంకోర్టు
పోక్సో, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చర్యలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై ఈమె బాగా పోరాడింది. మహిళా సాధికారిత కోసం విజయా రహత్కర్ చేసిన కృషికి జాతీయ సాహిత్య మండలి నుంచి జాతీయ న్యాయ అవార్డు, సావిత్రిబాయి ఫూలే అవార్డులు అందుకున్నారు. ఆమె డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను ప్రోత్సహించింది. మహిళల సమస్యలకు ప్రజల్లోకి తీసుకురావడానికి సాద్ పబ్లికేషన్ కూడా నడిపింది. 2007, 2010 మధ్య కాలంలో ఛత్రపతి సంభాజీనగర్ మేయర్ గా కూడా పనిచేసింది. పూణే విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.