నేటి సమాజంలో మహిళలు పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ కిషోర్ రహత్కర్ అన్నారు.
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయ రహత్కర్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మంగళవారం (అక్టోబర్22) బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీక రించిన తర్వాత ఆమె తన మొదటి ప్రసంగంలో.. మహిళ హక్కులను కాపాడటం, ఆడవాళ్లపై జరుగుతున్న హింసను అరికట్టండం, బాధితులకు తక్షణ న్యాయం జరిగాల్సిన అవసరం ఉందన్నారు.
ALSO READ | ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.. ఇబ్బందుంటే నాకు కాల్ చేయండి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద
మహిళలు, చిన్నారులపై లైంగిక, ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే నేరస్థులను త్వరగా గుర్తించడం, చట్టపరంగా తీసుకునే చర్యలు భయంకరంగా ఉండాలని అన్నారు.
జాతీయ మహిళా కమిషన్ చట్టబద్దమైన సంస్థ.. ఇది మహిళల హక్కులను కాపాడేందుకు అధికారం కలిగి ఉంది. రాజ్యాంగబద్ధంగా , చట్టపరంగా మహిళలకు అందించిన రక్షణను సమీక్షిస్తుందన్నారు.