ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిలేషన్‌పై ఆమె భర్త మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తనపై కొన్ని ఛానళ్లు పనికట్టుకుని దుష్ప్రచారం ప్రసారం చేస్తున్నాయన్నారు. ఐతే ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి చూశానన్నారు.
అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2024
అప్పటినుంచి ఇప్పటివరకు శాంతిని కూతురిగానే భావిస్తున్నానని తెలిపారు. తండ్రీకూతళ్ల బంధంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదుష్టకరమన్నారు. శాంతికి కొడుకు పుట్టాడంటే ఒక తండ్రిలా వెళ్లి చూసి ఆశీర్వదించి వచ్చానని.. అంతమాత్రానికే అక్రమ సంబంధం అంటకడుతారా అని ప్రశ్నించారు. తనకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని.. ఒట్టేసి చెప్తున్నానని అన్నారు.