వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి నేతలపై ఫైర్ అయ్యారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారతంలోకి వస్తామని, తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. రక్షాస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారని అన్నారు. మహిళకు ద్రోహం చేశానంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.
తన పేరు, ప్రతిష్టలను దెబ్బ తేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారు తమ పార్టీ వారైనా, ఎంతటివారైనా వదిలిపెట్టమని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నామని వెన్నక్కి తగ్గేది లేదని, తాటాకు చప్పుళ్లకు బయపడమని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలు జరిగినా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్టపరంగా ముందుకెళ్తామని, మహిళా కమిషన్ సహా అన్ని కమీషన్లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దుష్ప్రచారానికి పాల్పడ్డవారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని అన్నారు విజయసాయిరెడ్డి.