ప్రగతి భవన్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

ప్రగతి భవన్‌లో ఘనంగా విజయదశమి  వేడుకలు జరిగాయి.  దసరా పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆల‌యంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛర‌ణాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో  సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు.   

ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధ‌తిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం  అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

ALSO READ : జైలులో చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి