విజయ్ దేవర కొండ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. విజయ్ దేవరకొండ సమంత కలిసి నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్,రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ఖుషితో విజయ దేవర కొండ, సమంత కలిసి హంగామా చేయనున్నారు. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ లో విజయ్ సమంతలు లవ్లీగా చూడముచ్చటగా ఉన్నారు. విజయ్, సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి.
An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi - Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release
— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022
Spread the joy this Christmas, New Years ?@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I
నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మంచి రొమాంటిక్ కామెడిగా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పిలలో మిగతా షూటింగ్ చేయనున్నారు. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.