సింగరేణిలో యాక్టింగ్​పై .. పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి : శ్రీనివాస్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పలు విభాగాల్లో యాక్టింగ్​పై పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​ కొత్తగూడెం బ్రాంచ్​ సెక్రటరీ విజయగిరి శ్రీనివాస్​పేర్కొన్నారు. కొత్తగూడెం యూనియన్​ ఆఫీస్​లో మంగళవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ప్రతి ఏడాది సెప్టెంబర్​ నెలలో యాక్టింగ్​పై పనిచేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు కల్పిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికల​ కోడ్​ పేర ప్రమోషన్లను యాజమాన్యం ఆపేసిందని తెలిపారు. ఎన్నికల కోడ్​ పేర పీఎల్​ఆర్​ బోనస్​ చెల్లించలేదని గుర్తు చేశారు.