లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్​ను గెలిపించాలని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, శక్తి సమ్మేళన్​పార్లమెంట్​ఇన్​చార్జి విజయలక్ష్మి కోరారు. భువనగిరిలో జరిగిన మహిళా సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. పదేండ్ల మోదీ పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీశ్రేణులకు సూచించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ సమతారెడ్డి, రమాదేవి, శకుంతల, కాశమ్మ, సుర్వి లావణ్య, వైజయంతి, ప్రియదర్శిని, సుకన్య, శ్రీలత, రాణి, శ్రావణి, మాధవి, లక్ష్మి పాల్గొన్నారు.