GHMC మేయర్ గా విజయలక్ష్మీ బాధ్యతలు

GHMC మేయర్ గా విజయలక్ష్మీ బాధ్యతలు

హైదరాబాద్ : GHMC మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు గద్వాల విజయలక్ష్మీ. బల్దియా ప్రధాన కార్యాలయంలో పూజలు చేసి.. బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థనలు జరిపి.. ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు పూజారులు. తర్వాత.. విజయలక్ష్మి తండ్రి.. రాజ్యసభ సభ్యులు కేకే ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు, అధికారులు కొత్త మేయర్ కు విశెష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.