
దేశంలోనే అతి పెద్దదైన ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వీఆర్‌ఎల్ సంస్థ ఫౌండర్ విజయ్ శంకేశ్వర్ జీవితం ఆధారంగా రిషిక శర్మ రూపొందించిన చిత్రం ‘విజయానంద్’. ఆనంద్ శంకేశ్వర్ నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించాడు. డిసెంబర్ 9న ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. నిన్న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో నిహాల్ మాట్లాడుతూ ‘ఈ బయోపిక్ కోసం ఆరు నెలలు రీసెర్చ్ చేసి, ఆ తర్వాత విజయ్ శంకేశ్వర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఫ్యామిలీ మెంబర్స్ 150 గంటల పాటు చెప్పిన ఎన్నో విషయాలను రెండున్నర గంటల సినిమాగా మలిచాం.
98 రోజుల్లో షూట్ చేశాం. ఇందులో నేను మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తా. పాత్ర కోసం 22 కిలోలు బరువు పెరిగా. మా దృష్టిలో ఇదొక సినిమా కాదు.. ఎమోషన్’ అన్నాడు. డైరెక్టర్ మాట్లాడుతూ ‘మహానటి స్పూర్తితో ఈ సినిమా తీశాం. ఈ ట్రైలర్‌ను కూడా తెలుగు సినిమాలను దృష్టిలో పెట్టుకునే కట్ చేశాం. నిహాల్ ఐడియా వల్లే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. గోపీ సుందర్ మ్యూజిక్ బ్యాక్ బోన్. సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అన్నారు. ఆనంద్ శంకేశ్వర్ మాట్లాడుతూ ‘1976లో ఒక ట్రక్కుతో మొదలైన మా నాన్నగారి ప్రయాణం ఇప్పుడు ఐదు వేలకుపైగా చేరింది. దేశవ్యాప్తంగా పదిహేను వందల బ్రాంచ్‌లున్నాయి.
ఆయనదొక ఇన్‌స్పిరేషనల్ జర్నీ. నిహాల్ అద్భుతంగా నటించారు. లాంగ్ జర్నీని రెండున్నర గంటల్లో ఇంత అద్భుతంగా చూపించినందుకు రిషికకు థాంక్స్’ అన్నారు. హీరోయిన్ సిరి ప్రహ్లాద, నటులు భరత్ బొప్పన, అనీష్ కురువిల్లా, యూఎఫ్‌ఓ ప్రతినిధి లక్ష్మణ్ పాల్గొన్నారు.