
ఇండియాలో అతి పెద్ద కమర్షియల్ వెహికల్స్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్ వ్యవస్థాకుడు పద్మశ్రీ విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. నిహాల్ రాజ్‌పుత్ టైటిల్ రోల్ పోషించాడు. రిషికా శర్మ దర్శకత్వంలో ఆనంద్ శంకేశ్వర్ నిర్మించారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై బెంగళూరులో విడుదల చేశారు.
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన విజయ్ శంకేశ్వర్ ఎదిగిన తీరు, ఆయనకు ఎదురైన సవాళ్లు, బాధలను అధిగమించినట్టు ఇన్‌స్పైరింగ్‌గా చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ స్కోరు, ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్, నిహాల్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అనంత నాగ్, సిరి ప్రహ్లాద్, భరత్ బొప్పన, రవిచంద్రన్, షైన్ శెట్టి, అర్చన కొట్టిగే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.