
లాజిస్టిక్ రంగంతో పాటు మీడియా సహా పలు రంగాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వీఆర్ఎల్ ఇప్పుడు సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీలలో ఒకరైన విజయ్ శంకేశ్వర్ జీవిత చరిత్రగా ఆధారంగా తీసుకుని తెరకెక్కిన విజయానంద్ చిత్రాన్ని వీఆర్ఎల్ నిర్మిస్తోంది. వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న ఈ సంస్థ.. పాన్ ఇండియా మూవీ ‘విజయానంద్’ను డిసెంబర్ 9న రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విజయానంద్ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు నవంబర్ 6న బెంగుళూరులో రిలీజైన ‘ఆగి చూసే నా కన్నులే’ అనే సాంగ్ కు సైతం సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటిస్తుండగా ఆనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి.రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. సౌతిండియన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.