AP Liquor Scam: ముగిసిన విజయసాయిరెడ్డి సిట్​ విచారణ.. కీలక విషయాలు వెల్లడి

AP Liquor Scam: ముగిసిన విజయసాయిరెడ్డి సిట్​ విచారణ.. కీలక విషయాలు వెల్లడి

ఏపీ లిక్కర్​ స్కాం కేసులో  విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది.  మూడు గంటలపాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్​విచారణ తరువాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.   తనను 4 అంశాలకు సంబంధించి  ప్రశ్నలు అడిగారన్నారు.  హైదరాబాద్‌లో జర్నలిస్టు కాలనీలో తన ఇంట్లో జరిగిన మీటింగ్​.. విజయవాడలో తన నివాసంలో జరిగిన మీటింగ్​లపై ఆరా తీసిన సిట్​..  ఈ సమావేశాల్లో ఎవరెవరు పాల్గొన్నారు.. లిక్కర్​ పాలసీ గురించి ఏం మాట్లడుకున్నారు అని అడిగారని విజయసాయి రెడ్డి తెలిపారు.  

సిట్​ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానంటూ . నిజమే మీటింగ్ లు జరిగాయి అని వారికి స్పష్టం చేశాను.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ తో పాటు పలువురు హాజరు అయ్యారు అని చెప్పాను.. ఆ సమావేశం లో లిక్కర్ పాలసీ గురించి మాట్లాడారు. కిట్​ బ్యాగ్స్​ విషయం గురించి అడిగినప్పుడు   వాటి గురించి నేను మాట్లాడనని ఆ మీటింగులో చెప్పానన్నారు. 

రాజ్​ కసిరెడ్డి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..  రాజ్ కసి రెడ్డి కొన్ని కంపెనీలను లీజ్ కు తీసుకొని కొత్త బ్రాండ్ ఫ్లోట్ చేశారా? అని అడిగారు..  మిథున్ రెడ్డిని మీరే అడగండి అని సూచించారు.. రాజ్ కసిరెడ్డిని అప్ స్క్యాండ్ అయ్యాడు.. ఆయన్ను తెచ్చి ఆ ప్రశ్నలు అడగండి అని మీడియాకు సూచించారు. 

అదాన్, డిస్తలరీస్ కు రూ. 60 కోట్లు డీ కార్ట్ కంపెనీ కు రూ. 40 కోట్లు ఇప్పించారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 12 శాతం ఇంట్రెస్ట్కు  ఇప్పించాను అని చెప్పానన్నారు.   ఎవ్వరైనా వారికి డబ్బులు ఇప్పించాలి అని చెప్పారా అని అడిగారు.. అలాంటిది ఏమీ లేదు.. నేనే ఇప్పించానని చెప్పానన్నారు.   60 కోట్లు కు 12 శాతం వడ్డీ చెల్లించారు 40 కోట్లు అసలు ఇంకా ఇవ్వలేదు డిస్ప్యూట్ లో వుంది అని చెప్పానని తెలిపారు.

2017-18లో రాజ్ కాసిరెడ్డి పార్టీలోకి వచ్చారు.. అతను తెలివైన క్రిమినల్.. అటువంటి వాడు కాదని నేను అతన్ని ఎంకరేజ్ చేశాను.. ఆయనకు ఎన్ ఆర్ ఐ విభాగం, తరువాత ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు అప్పగించా.. కానీ, రాజ్ కసిరెడ్డి పార్టీని, ప్రజలను మోసం చేశారని తెలిపారు.. పార్టీని, ప్రజలను రాజ్ కాసిరెడ్డీ మోసం చేశాడు అని అందరికి తెలిసిందే అన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..