- ఫేస్బుక్లో విజయశాంతి పోస్ట్
హైదరాబాద్, వెలుగు: ‘సీఎం కేసీఆర్ను ఇప్పుడే చూడండి.. మళ్లీ తరువాత కనపడడు’.. అంటూ సోషల్ మీడియాలో విజయశాంతి సెటైర్ వేశారు. ‘‘బహిరంగ సభలోనే సీఎం దొరను ఒక్కసారి చూసుకోండ్రి. మళ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే ఆయన కనబడడు, వినబడడు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలకు.. సీఎం కామెడీ వాగ్దానాల ద్వారా ఎంతో కొంత రిలీఫ్ వస్తుండొచ్చు. ఆయన ఇచ్చే హామీలు.. ఎప్పటిలాగానే అమలు కావన్న సంగతి మనందరికీ తెలిసిందే’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.