వెళ్లి వాళ్ల దగ్గర చెంచాగిరి చేసుకోండి.. నెగటివ్ రివ్యూలపై విజయశాంతి మాస్ వార్నింగ్

వెళ్లి వాళ్ల దగ్గర చెంచాగిరి చేసుకోండి.. నెగటివ్ రివ్యూలపై విజయశాంతి మాస్ వార్నింగ్

సినిమాలకు నెగటివ్ పబ్లిసిటీ చేసేవారికి   నటి విజయశాంతి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాలు బాగలేకపోతే ఫెయిల్ కావడం కామన్.కానీ కొందరు దుష్ట శక్తులు కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొందరు సినిమాను ఖూనీ చేస్తూ పైశాచిక ఆనంద పొందుతున్నారని మండిపడ్డారు. బాగున్న సినిమాను బాగలేదని..బాగలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సూచించారు.  

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన విజయశాంతి.. థియేటర్ లో సినిమాను చూసిన ప్రేక్షకులు బాగుందంటున్నారు కానీ  కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సినిమాను చంపే హక్కు లేదని..సినిమాల వెనుక చాలా మంది జీవితాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరం ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమాల్లోకి వస్తున్నారని అన్నారు. సినిమా నచ్చకుంటే చూడొద్దన్నారు. ఎవరైతే మిమ్మల్ని గెలుకుతారో మీ మైండ్ వాష్ చేస్తారో అలాంటి వాళ్లు.. వాళ్ల దగ్గరకు వెళ్లి చెంచాగిరి చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. సినిమాను నాశనం చేద్దామనుకునే వాళ్లను అసలు క్షమించొద్దని మండిపడ్డారు. అందరి సినిమాలు ఆడాలని కోరుకున్నారు. 

విజయశాంతి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కీలక పాత్ర పోషించారు.ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ చేసిన  ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.