హసన్‌పర్తి, వెలుగు : కేసీఆర్ ఒక్కడి పోరాటంతోనే తెలంగాణ ఏర్పడలేదని, వందలాది మంది యువకుల బలిదానాలతో రాష్ట్రం ఆవిర్భవించిందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పారు. వర్ధన్నపేట కాంగ్రెస్ క్యాండిడేట్ నాగరాజుకు మద్దతుగా హనుమకొండ మండలం గుండ్లసింగారం కాలనీలో గురువారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియంత సర్కార్‌ను గద్దె దింపితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నమిండ్ల శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, బక్క జడ్సన్, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పిల్లి వెంకటనరసింహారెడ్డి, కుందూరు వెంకటరెడ్డి పాల్గొన్నారు