బీఆర్ఎస్​పై విజయశాంతి విమర్శలు

బీఆర్ఎస్​పై విజయశాంతి విమర్శలు

హైదరాబాద్, వెలుగు : ఓటర్లకు కోట్లు పంచినా మహారాష్ర్ట లో జరి గిన మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆ ర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని  బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఎన్నికల్లో పార్టీలన్నీ ఓటర్లకు డబ్బులు పం చాలనే సందేశాన్ని బీఆర్ఎస్ ఇచ్చిందని మండిపడ్డారు. భవిష్య త్తులో దేశమంతా కేసీఆర్ ఇదే  ఫార్ములా అమలు చేస్తరా అని గురు వారం ట్వీట్ లో ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో లక్షల కోట్లు దోచుకొని దేశంలోని అన్ని పార్టీల ఎలక్షన్ ఖర్చు భరించేందుకు సీఎం ముందు కు వెళుతున్నారని తెలిపారు. కేసీ ఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థనే అవ హేళన చేస్తున్నారని మండిపడ్డారు.