హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మరోసారి సీరియస్ అయ్యారు బీజేపీ లీడర్ విజయశాంతి. కేసీఆర్ పై తనదైన స్టైల్లో విమర్శించిన ఆమె..సీఎం కేసీఆర్ పేరు(KCR)కు కొత్త అర్థం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని విజయశాంతి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను తిరగనీయకండ్రంటూ తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంతోనే కుంటిసాకులు చూపి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. హుజూరాబాద్ తరహాలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని విజయశాంతి తెలిపారు.
ఇవి కూడా చదవండి