స్టార్ డైరెక్టర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విజయవాడ అమ్మాయి..

స్టార్ డైరెక్టర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విజయవాడ అమ్మాయి..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వైవియస్ చౌదరి దాదాపుగా 10ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైవియస్ చౌదరి తెలుగులో ప్రముఖ స్వర్గీయ నిర్మాత నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి తారకరామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే నందమూరి తారకరామారావు ఫస్ట్ దర్శన్ అంటూ ఓ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వీణా రావు ని తీసుకున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా వీణారావుకి కూడా ఇది తొలి సినిమా. దీంతో శుక్రవారం వీణా రావు ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు. దీంతో వీణ రావుని చూసిన ఆడియన్స్ ఆమె అందానికి ఫిదా అయ్యారు. అయితే వీణా రావు విజయవాడకి చెందిన కూచిపూడి డ్యాన్సర్. తెలుగు చక్కగా మాట్లూడుతుంది. అయితే  చిన్నప్పటి నుంచి ఆమెకి నటనపై ఆసక్తి ఉండటంతో 18 నెలలుగా డైరెక్టర్ వైవియస్ చౌదరి దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. 

Also Read :- పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!

ఈ క్రమంలో ఆమె ప్రతిభని మెచ్చుకున్న వైవియస్ చౌదరి తారకరామారావు సినిమాలో హీరోయిన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ఆడియన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో తెలుగమ్మాయిలని ప్రోత్సహించడం మంచిదని అంటున్నారు. వీణా రావుకి చక్కటి అందం, అభినయం ఉందని టాలెంట్ నిరూపించుకుంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వడం ఖాయమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో మహేష్ బాబు(యువరాజు), రామ్ పోతినేని (దేవదాస్), బాలకృష్ణ(ఒక్కమగాడు), సాయి దుర్గ తేజ్(రేయ్) తదితర స్టార్ హీరోలకి దర్శకత్వం వహించాడు. అంతేగాకుండా నిర్మాతగ, ఎడిటర్ గ కూడా పనిచేశాడు. కానీ అనుకోని కారణాలవల్ల 2015 నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నందమూరి హీరో సినిమాతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.