ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు : ముగ్గురు ప్రయాణికులు మృతి

విజయవాడలో దారుణం జరిగింది. బస్ స్టాండ్ లోని ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి ఉన్నారు. 

12వ నంబర్ ప్లాట్ఫాం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఈ బస్సుకు.. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ALSO READ : నిజాయతే నా బలం : కడియం శ్రీహరి