సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను ఏడురోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో A1గా ఉన్న సతీష్ కు ఇప్పటికే 14రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రేరేపించాడంటూ అనుమానించి అదుపులోకి తీసుకున్న దుర్గారావును విచారణ తర్వాత ఈ దాడిలో అతని ప్రమేయం లేదని నిర్దారించి విడుదల చేశారు.

ఈ కేసు విషయంలోఅధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. దుర్గారావుకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా అరెస్ట్ చేశారంటూ అతని కుటుంబ సభ్యులు, వడ్డెర కాలనీ వాసులు కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసనకు కూడా దిగిన సంగతి తెలిసిందే.మరి, ఎన్నికల సమీపిస్తున్న వేళ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Also Read:వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..