విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్‌. ...విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు దిగువున ఇప్పటికే మూడు చెట్లు కూలిపోయాయి.  అమ్మవారి దర్శననానికి వచ్చే భక్తులను   లిఫ్ట్ మార్గం వైపు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నామని డిప్యూటీ కలెక్టర్ & 
కార్యనిర్వాహణాధికారి కే ఎస్ రామారావు తెలిపారు. 

విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు శనివారం  (ఆగస్టు 31) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు

ALSO READ | విజయవాడలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి..

ఇక విజయవాడ జిల్లాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా అధికారుల‌ను అప్ర‌మ‌త్తమయ్యారు…అన్ని శాఖల‌ అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా ఉండి అవ‌స‌ర‌మైన స‌హాయక చ‌ర్య‌లు త‌క్ష‌ణం చేప‌డుతున్నారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన సూచ‌న‌లు చేశారు. పొంగే వాగులు, వంకల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.