
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన .. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ ని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG
నిన్న ఫేస్ బుక్ వేదికగా కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ తనను కలసి జనవరి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో తనను కలగ చేసుకోవద్దని చంద్రబాబు తనకు చెప్పమన్నారని తెలియచేశారన్నారు.
అలాగే రాబోయే ఎన్నికలో తన స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని తనకుతెలియచేశారని చెప్పారు . పార్టీ అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి తాను హామీ ఇచ్చాను అని చెప్పారు.