అంతర్జాతీయ దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు విజయవాడ పోలీసులు. నకిలీ కరెన్సీ చలామణి చేస్తుండగా ఆరుగురు కేటుగాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా తాడేపల్లి ,సీతానగరం కి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నట్లు సమాచారం అందటంతో పక్క ప్లాన్ తో నిందితులను పట్టుకున్నారు.ఈ ముఠా రూ. లక్ష అసలు నోట్లు ఇస్తే, రూ.మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించగా విజయవాడ సమీపంలోని సూరాయిపాలెం వద్దకు వచ్చి ఇరు వర్గాలు సమావేశమైనట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో కొందరు పొలిసు వేషంలో వచ్చి హడావిడి చేయగా రెండు కార్లలో ఒకదాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.