ముంబైనటి జెత్వానీ కేసులో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయం..

ముంబైకి చెందిన హీరోయిన్‌ కాదంబరీ జెత్వానీ పై పోలీసులు చేసిన వేధింపుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అత్యంత వివాదంగా మారుతున్నది. ఈ వ్యవహారంలో ముంబై నుంచి హీరోయిన్‌ను విజయవాడకు తీసుకొచ్చిన వ్యవహారాన్ని తాజా దర్యాప్తు కిడ్నాప్ కేసుగా మారనుండటంతో ఈ కేసు వ్యవహరం రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు చుట్టుకొనే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ కేసు విచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ స్రవంతీ రాయ్ ను  ఎన్టీఆర్  జిల్లా పోలీసు కమిషనరేట్ నియమించింది. ఇబ్రహీంపట్నం పీఎస్ లో కాదంబరిపై నమోదైన కేసుపై సమగ్రంగా  విచారణ జరపాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.  కాదంబరిపై తప్పుడు కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై వాస్తవాలు నిగ్గుతేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. 

కేసు వివరాల్లోకి వెళ్తే ..

ముంబైనటి జత్వాని కేసులో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  హిందీ హీరోయిన్‌తో విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ నేత నేత కుమారుడు ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే పెళ్లి వరకు వచ్చే సరికి కుటుంబం వ్యతిరేకించడంతో సదరు ప్రేమికుడు ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఆ అమ్మాయి వినకపోవడం, బెదిరింపులకు పాల్పడటంతో రాజకీయ నేత తన పార్టీ కీలక నేతలకు తన కుమారుడి వ్యవహరాన్ని వివరించారు.  విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి  బాధితురాలు.. హీరోయిన్ కుటుంబాన్ని  బెదిరించి... వారిని విజయవాడకు తీసుకువచ్చారని ఆరోపణలు వచ్చాయి.  ఆ తర్వాత 14 రోజులపాటు ఓ గెస్ట్ బంధించి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ. ఆ తర్వాత ఆమెను చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారనే వార్తలు వెలుగుచేశాయి.  అనేది మీడియాలో ప్రధానంగా వెలుగు చూశాయి. 

ఇప్పుడు  ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం  అన్ని వివరాలు సేకరిస్తున్నది. ఈ కేసుపై ఆచీతూచీ వ్యవహరిస్తూ.. రాజకీయ నేతలు, పోలీసు అధికారులపై కేసులు పెట్టే ఆలోచనలో ఉంది. ఈ కేసు దిశగా అడుగులేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. పారిశ్రామిక వేత్తపై కేసు, లేదా విజయవాడ రాజకీయ నేత కుమారుడి ప్రేమ వ్యవహారం ఆధారంగా ఆ హీరోయిన్‌‌ను వేధించారా? అనేది తేల్చాల్సిన ప్రశ్నగా మారింది. ప్రభుత్వం, పోలీసులు చేసే దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకొంటారనే విషయం చర్చనీయాంశమవుతున్నది.