అవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!

ఎప్పుడు దేనికి టైమ్ వస్తుందో చెప్పలేం భయ్యా, ఎందుకు పనికిరాని వస్తువు కూడా ఒక్కోసారి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. పనికిరాదని భావించి మూలన పడేసిన వస్తువులే మనకు కోట్లు తెచ్చి పెట్టే రోజు కూడా వస్తుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమండి.. పాత నట్లు, బోల్టులు అమ్మితే విజయవాడ రైల్వే డివిజన్ కి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే అవాక్కవ్వటం మీ వంతు అవుతుంది.

విజయవాడ రైల్వే డివిజన్ కి సంబంధించిన 1,547 మెట్రిక్ టన్నుల స్క్రాప్ బుధవారం ఈ ఆక్షన్ లో అమ్మగా, 7.20కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది డివిజన్ చరిత్రలోనే అత్యధిక ఆదాయం అని అన్నారు అధికారులు. 2023 - 2024ఆర్థిక సంవత్సరానికి గాను 21,460 మెట్రిక్ టన్నుల స్క్రాప్ అమ్మగా 89.94కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు. వేలం వేసిన స్క్రాప్ లో రైళ్లకు సంబందించిన సామాన్లు, ఐరన్, స్టీల్ తో పాటు ఇతర మెటల్స్ కూడా ఉన్నట్లు తెలిపారు రైల్వే అధికారులు.