చెన్నై: ప్రముఖ తమిళ హీరో విజయ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం (టీవీకే)' పార్టీ ఈసీ వద్ద అధికా రికంగా రిజిస్టర్ అయింది. ఈ మేరకు విజయ్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ వచ్చిందని అందులో పేర్కొన్నారు. తమ పార్టీ మొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని విజయ్ తెలిపారు.
దళపతి విజయ్(Thalapathy Vijay) గురువారం (ఆగస్ట్ 22న) తన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నై పనైయుర్ లోని పార్టీ కార్యాలయంలో తన పార్టీ జెండాను, గుర్తును ఆవిష్కరించిన సందర్భంగా విజయ్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.