జగన్ కు షాక్: అమ్మ మద్దతు కూతురికే..  

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన క్రమంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇవాళ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో నేతలంతా ఈ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఊహించని షాక్ తగిలింది. అసలే చెల్లెలు షర్మిల కడప ఎంపీగా బరిలో ఒకవైపు, మరో చెల్లెలు సునీత వివేకా హత్య కేసుపై ఆరోపణలు చేస్తూ మరొక వైపు తలనొప్పిగా మారిన క్రమంలో తల్లి విజయమ్మ మరో షాక్ ఇచ్చింది.

కడప ఎంపీగా బరిలో దిగిన షర్మిలను గెలిపించాలని కడప ప్రజలను కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది. షర్మిల చంద్రబాబు కుట్రలో భాగమైందని స్వయానా జగన్ ఆరోపిస్తున్న క్రమంలో విజయమ్మ ఈ వీడియో రిలీజ్ చేయటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మొత్తానికి పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉన్న క్రమంలో విడుదలైన విజయమ్మ వీడియో షర్మిల విజయంపై మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.