ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం

  • వికారాబాద్ అడిషనల్ కలెక్టర్​ లింగ్యా నాయక్​

కొడంగల్​, వెలుగు : లోక్ సభ ఎన్నికలను పారదర్శకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో  నిర్వహించడంలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమని వికారాబాద్ అడిషనల్​కలెక్టర్​ లింగ్యా నాయక్​పేర్కొన్నారు. బుధవారం కొడంగల్ టౌన్ లోని ప్రభుత్వ  జూనియర్​ కాలేజ్​లో  ఎన్నికల నిర్వహణపై ట్రెనింగ్​క్యాంప్​ నిర్వహించారు. పోలింగ్ ప్రాసెస్​లో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలనే వాటిపై వివరించారు.

పోలింగ్​డ్యూటీలను డిసిప్లిన్​తో చేయాలని సూచించాఉ. పోలింగ్​సెటప్​, ఈవీఎం వీవీ ప్యాట్, టెండర్డ్​ఓట్, చాలెంజ్ డ్ ఓట్​, పీఓ డైయిరీ, పీఓ రిపోర్ట్​లపై  అవగాహన కల్పించారు. ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, తహసీల్దార్​మహేష్​ గౌడ్​, ఎలక్షన్​డీటీ సురేష్​కుమార్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.