
- 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని వికారాబాద్, నారాయణపేట కలెక్టర్ల ఆదేశాలు
కొడంగల్, వెలుగు: మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తాపట్నాయక్ ఆదేశించారు. బుధవారం కొడంగల్ అభివృద్ధిపై కడా ఆఫీసులో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, మిషన్ భగీరథ పైపు లైన్లు, పంచాయతీరాజ్ , ఆర్అండ్బీ పనులను 4 నెలల్లో పూర్తిచేసి టార్గెట్రీచ్కావాలన్నారు. డిగ్రీ, జూనియర్ కాలేజీలు, బీసీ గురుకులం బిల్డింగ్పనులపై ఆరా తీశారు. దౌల్తాబాద్ మండంలోని కేజీబీవీ, పీహెచ్సీ పనులకు, బోంరాస్‌పేట మండలంలో స్కూల్భవనాలు, అంగన్వాడీ, మహిళా సమాఖ్య, పంచాయతీల బిల్డింగుల పనులకు టెండర్లు పూర్తిచేయాలని ఆదేశించారు. వెటర్నరీ, మెడికల్‌కాలేజీల నిర్మాణ పనులను మొదలుపెట్టాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం కొడంగల్220 పడకల ఆసుపత్రి, ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్, దుద్యాల మండలంలోని సమీకృత కార్యాలయాల పనులను కలెక్టర్ప్రతీక్జైన్ తనిఖీ చేశారు. సమావేశంలో కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్జిల్లాలోని నేషనల్ హైవేలు, వివిధ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ప్రతీక్జైన్ చెప్పారు. భూసేకరణపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద భూములకు సంబంధించి నష్ట పరిహారం ఆయా కోర్టుల్లో డిపాజిట్ చేసి భూ సేకరణ ప్రాసెస్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఇంజనీర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.