అమ్మ ఆదర్శ స్కూళ్లలో పనులు కంప్లీట్ చేయండి... వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

అమ్మ ఆదర్శ స్కూళ్లలో పనులు కంప్లీట్ చేయండి... వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను స్పీడ్ గా కంప్లీట్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమాఖ్య భవనంలో మండల సమాఖ్య అధ్యక్షులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల ఫురోగతిపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా పనులు చేయించాలని, మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి స్కూల్ నుంచి తాగునీరు, టాయిలెట్స్, లైట్స్, ఫ్యాన్స్ తదితర మరమ్మతుల ఖర్చుల వివరాలను అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, ఐకేపీ సమాఖ్య అధ్యక్షుడు పాల్గొన్నారు.

అర్జీలు పెండింగ్ పెట్టొద్దు  

ప్రజల ఫిర్యాదులను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను   ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి150 అర్జీలు వచ్చాయి. ధరణి, భూ సర్వే, ఆసరా పెన్షన్లపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.

ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలని కలెక్టర్ సూచించారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, ఇన్ చార్జ్ అడిషనల్  కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా అధికారులు
 పాల్గొన్నారు.