విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి

విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి
  •     వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు: స్కూల్ యూనిఫాంను సకాలంలో విద్యార్థులకు అందించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసే స్కూల్ యూనిఫామ్ ను డీఈవో రేణుకాదేవి సమక్షంలో స్కూళ్ల హెడ్ మాస్టర్లకు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్ లను నాణ్యత, డిజైన్లతో కుట్టించడం జరిగిందని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించారు. 

యూనిఫామ్ లో మార్పులు చేర్పులు ఉంటే సరి చేయాలని సూచించారు.  రూ. కోటి 20 లక్షలు కుట్టు కూలి కింద ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల10న యూనిఫామ్ లు స్కూళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  అడిషనల్ డీఆర్డీవో సరోజ, డీపీఎంలు రామ్మూర్తి, నర్సింలు, జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.