కడా పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రతీక్​ జైన్

కొడంగల్, వెలుగు: అభివృద్ధి పనుల్లో కచ్చితంగా నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్​కలెక్టర్ ప్రతీక్​జైన్ ఆదేశించారు. కొడంగల్​ఏరియా డెవలప్​మెంట్ ఆఫీస్​లో ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్, ఫారెస్ట్, విద్యుత్ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కొడంగల్​సెగ్మెంట్​లో జరుగుతున్న రోడ్ల పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు.

అలాగే కడా కింద మంజూరైన పనులు త్వరగా పూర్తయేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సబ్​కలెక్టర్​ఉమాశంకర్ ​ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, పీఆర్ఎస్ఈ శ్రీనివాస్​రెడ్డి, ఆర్అండ్​బీ ఎస్ఈ వసంత్​నాయక్, విద్యుత్​శాఖ ఎస్ఈ నీలావతి, మిషన్​భగీరథ ఎస్ఈ జగన్మోహన్, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.